

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ నటించిన తాజా చిత్రం “బైసన్”. దర్శకుడు మారి సెల్వరాజ్ రూపొందించిన ఈ సినిమా రూరల్ అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా. తమిళనాడులో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు.
ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ కారణంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బైసన్ నవంబర్ 21, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ సినిమా కేవలం తమిళం, తెలుగుకే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ నిర్మించారు.
ఏదేమైనా, ఈ సినిమా ద్వారా ధృవ్ విక్రమ్ 70 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!