

ఇటీవల విడుదలై మంచి స్పందన పొందిన తెలుగు సినిమాల్లో ‘దండోరా’ ఒకటి. శివాజీ, నవదీప్, నందు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కుల ఘర్షణ నేపథ్య చిత్రాన్ని దర్శకుడు మురళికాంత్ తెరకెక్కించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ఈ సినిమాకు మరింత గుర్తింపు తెచ్చింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్. తారక్ ఈ సినిమా గురించి ప్రశంసిస్తూ పోస్ట్ చేయడంతో, ప్రైమ్ వీడియోలో మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇప్పటికే ఒకసారి నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉన్న ఈ సినిమా తరువాత టాప్ 5 కంటే దిగువకు వెళ్లింది. అయితే ఎన్టీఆర్ ట్వీట్ తర్వాత దేశవ్యాప్తంగా టాప్ 2 స్థానానికి చేరుకుంది.

దీనితో ఎన్టీఆర్ స్టార్ పవర్ ఎంత ప్రభావవంతమో మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో రవి కృష్ణ కూడా కీలక పాత్రలో నటించగా, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా వ్యవహరించారు. మొత్తం మీద ‘దండోరా’కి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!