

ఈ ఏడాది టాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఒకటి. అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు సాయిలు కంపాటి (బోస్) తెరకెక్కించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈటీవీ విన్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం, ‘రాజు వెడ్స్ రాంబాయి’ డిసెంబర్ 18 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో చూడలేకపోయినవారికి ఇది మంచి అవకాశం.
ఈ చిత్రానికి సురేష్ బొబ్బలి సంగీతం అందించగా, వేణు ఊడుగుల మరియు రాహుల్ మోపిదేవిలు నిర్మాణం వహించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ప్రేమకథ ఇప్పుడు ఓటిటీలో మరోసారి ఆకట్టుకోనుంది.






.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!