

ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బేబీ డూ డై డూ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నేరం, యాక్షన్, ప్రతీకారం, ప్రేమ అంశాల మేళవింపుతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ చిత్రంలో బేబీ అనే మూగ, చెవిటి యువతి పాత్రలో హ్యూమా ఖురేషీ కనిపిస్తుంది. తండ్రి కుటుంబ బాధ్యతలను పట్టించుకోకపోవడంతో ఇంటి బాధ్యతలను ఆమెనే చూసుకుంటుంది. బయటకు సాధారణ యువతిలా కనిపించే బేబీ.. రహస్యంగా కాంట్రాక్ట్ కిల్లర్‌గా పనిచేస్తుంటుంది. చిన్నతనంలో తన కళ్ల ముందే తన కవల సోదరి దారుణ హత్యకు గురికావడంతో, ఆమె మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా జీవిస్తుంది. ఈ క్రమంలో సిద్ధూతో ప్రేమలో పడుతుంది. అదే సమయంలో ఓ శక్తివంతమైన రౌడీని హత్య చేయడానికి కాంట్రాక్ట్ అందుతుంది. అతడికి బేబీకి ఉన్న సంబంధం ఏంటి? ఆమె సోదరిని హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!