

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దాయిరా’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘సలార్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీరాజ్ ఇందులో పోలీస్ అధికారిగా నటించగా, కరీనా కపూర్ మరో కీలక పాత్రలో కనిపించారు.
ఢిల్లీలో రాగిణి అనే యువతిపై జరిగిన హత్యాచార ఘటనతో కథ ప్రారంభమవుతుంది. ఈ కేసును విచారించిన డీసీపీ రామన్ కుమార్ నలుగురు నిందితులను అరెస్టు చేస్తాడు. అనంతరం తన బృందంతో కలిసి వారిని ఎన్‌కౌంటర్ చేయడంతో ప్రజలు అతడిని హీరోగా కీర్తిస్తారు. అయితే, ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఎన్‌కౌంటర్ నిజమైనదా, నకిలీదా అనే విషయాన్ని తేల్చేందుకు కరీనా పోషించిన విజిలెన్స్ అధికారి అజూని కోహ్లి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటవుతుంది. ఈ విచారణలో బయటపడే నిజాల చుట్టూ కథ సాగుతుంది. ఢిల్లీలోని నిర్భయ, హైదరాబాద్‌లోని దిశ ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!