
సినిమాలు

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు.పి దర్శకత్వం వహించారు. థియేటర్లలో మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ‘ఇది ఒక ఫ్యాన్ బయోపిక్’ అంటూ తప్పక చూడాల్సిన సినిమా అని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఓటీటీలో మంచి ఆదరణ పొందే అవకాశముందని భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!