
సినిమాలు

బాపట్ల జిల్లా చీరాలలో పెట్రోల్ బంకు సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఆర్టీవో కార్యాలయం సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో శుక్రవారం అర్ధరాత్రి కొందరు యువకులు కారులో వచ్చి రూ.4 వేల విలువైన ఇంధనం నింపించుకున్నారు. అనంతరం డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి కారును ముందుకు పోనిచ్చారు. దీంతో బంకులో పనిచేస్తున్న కరుణసాగర్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.
కారులో ముందు సీటులో ఉన్న వ్యక్తిని కరుణసాగర్ పట్టుకోగా.. నిందితులు వాహనాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లారు. దీంతో అతడు కారుతో పాటు కొంతదూరం ఈడ్చుకెళ్లబడ్డాడు. ఈ ఘటనలో కరుణసాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాల్లో ఈ ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!