

2021 లో ఆహా లో విడుదలైన ‘3 Roses’ వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. ఈ సిరీస్ లో ఈషా రెబ్బా, పాయల్ రాజ్పుత్, మరియు పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించగా, దానికి మ్యాగీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను దర్శకుడు మారుతి సృష్టించగా, ఎస్కేఎన్ నిర్మాణం వహించారు.
ఇప్పుడు ఈ సిరీస్ రెండో సీజన్ ఆహా లో రాబోతోంది. మొదట ఇది రేపు(డిసెంబర్ 12) విడుదల కావాల్సి ఉండగా, నిర్మాత ఎస్కేఎన్ తాజాగా విడుదల ను డిసెంబర్ 13 కి వాయిదా వేశారు. కారణం — నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ రేపు థియేటర్లలో విడుదల కావడం.
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ‘అఖండ 2’ జోష్ లో ఉంది. అందువల్ల అదే రోజున తమ వెబ్ సిరీస్ను విడుదల చేస్తే ప్రేక్షకుల దృష్టి మరలిపోతుందనే భావన తో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త సీజన్ లో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుశిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించగా, సత్య మరియు హర్ష చెముడు (వైవా హర్ష) ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సీజన్ కు కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!