
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి గ్యాస్ సరఫరా నిలిపివేయొద్దని దేవస్థానం ఈవో హెచ్‌పీసీఎల్‌కు లేఖ రాశారు. ఆలయంలో ప్రతిరోజూ జరిగే అన్నప్రసాదం, నైవేద్యాల కోసం గ్యాస్ అవసరం ఎక్కువగా ఉంటుందని, సరఫరా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై హెచ్‌పీసీఎల్ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ప్రస్తుతం యాదాద్రి దేవస్థానంలో ప్రతి నెలా సుమారు మూడు నుంచి మూడున్నర టన్నుల వరకు గ్యాస్ వినియోగం జరుగుతోంది. దేవస్థానం వద్ద ఇప్పటికే రెండు నెలలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!