
రాజకీయాలు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘అఖండ 2’ తర్వాత వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమా ప్రారంభించిన ఆయన, అదే సమయంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా సమాంతరంగా చేయాలని భావిస్తున్నారు. సీనియర్, యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలని బాలయ్య ఆలోచిస్తున్నట్లు సమాచారం.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ముందుగా చారిత్రక కథగా ఉండగా, ఇప్పుడు పూర్తిగా యాక్షన్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌గా మారినట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ పవర్‌ఫుల్ డాన్‌గా కనిపించనున్నారని సమాచారం. అదే సమయంలో కొరటాల శివతో సినిమా చర్చలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. కొన్ని యువ దర్శకుల ప్రాజెక్టులు కూడా మార్పులు లేదా వాయిదా పడినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.





.webp&w=3840&q=75)






.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!