

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి విషయంలో వచ్చిన తాజా ప్రకటన భారత్‌కు ఊరట కలిగించేలా ఉంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు జరుగుతోంది. మనదేశానికి చమురు, గ్యాస్ తీసుకువచ్చే నౌకలకు ఈ మార్గం అత్యంత కీలకం. మొదటగా కేవలం చైనా జెండా ఉన్న నౌకలకే ప్రవేశం ఉంటుందని ఇరాన్ ప్రకటించినప్పటికీ, తాజాగా ఇచ్చిన స్పష్టతతో భారత్‌కు కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి.
ఇక ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా అంతరాయం కలగడంతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, కెనడా భారత్‌కు గ్యాస్ సరఫరా చేయడానికి ముందుకొచ్చాయి. అలాగే అమెరికా కూడా చమురు సరఫరాకు సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం భారత్ రోజుకు 195 ఎమ్ఎమ్ఎస్సీఎమ్డీ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుండగా, అందులో 60 ఎమ్ఎమ్ఎస్సీఎమ్డీ ఖతార్ నుంచే వస్తోంది. ఇదిలా ఉండగా దేశంలో సుమారు 8 వారాలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా బీమా కవరేజీ సమస్యల వల్లే నౌకలు ప్రయాణించడం తగ్గిందని, హర్మూజ్ మార్గం అధికారికంగా మూసివేయలేదని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!