

ఐబొమ్మ రవి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్‌లో కలవరపెట్టే అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు. మొదటి నుంచే రవికి నేరప్రవృత్తి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నేరాలకు పాల్పడేందుకు అతడు తన స్నేహితుడి గుర్తింపు కార్డులను ఉపయోగించుకుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో తన భార్య, పిల్లలను భావోద్వేగపరంగా — అవసరమైతే శారీరకంగానూ — హింసకు గురిచేసినట్టు సమాచారం. రవి ప్రవర్తనను భరించలేక చివరికి అతని భార్య విడాకులు తీసుకున్నట్లు విచారణలో తేలింది.
ఇదే సమయంలో, ఐబొమ్మ సైట్లో బెట్టింగ్‌కు సంబంధించిన ఒక బగ్‌ను ఉపయోగించుకుని రవి అక్రమ ఆదాయం సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. లక్ష వ్యూస్‌కి సుమారు 50 డాలర్లు అతడికి లభించేవని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ప్రచార పోస్టర్ల డిజైన్ కోసం నిఖిల్‌కు ప్రతినెల రూ.50,000 చొప్పున చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటిపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!