

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు శుభవార్త — విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్థాయిలో మార్పులు పొందబోతోంది.
నీతీ ఆయోగ్ ఆమోదించిన ఈ ₹661 కోట్ల అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మోడల్లో, ముఖ్యంగా DBFOT (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో అమలవనుంది.ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, స్టేషన్లో ఇంకా రెండు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటవుతాయి — మొత్తం పది ప్లాట్‌ఫారమ్‌లు అవుతాయి. అలాగే ప్రయాణికుల సౌకర్యం కోసం 20 లిఫ్టులు, 15 ఎస్కలేటర్లు, మరియు 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు నిర్మించబడతాయి.జి+2 పార్కింగ్ బ్లాక్ నిర్మాణం ద్వారా దాదాపు 2,000 వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. అదనంగా, స్టేషన్ వెస్ట్రన్ సైడ్ విస్తరింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, తద్వారా పెరుగుతున్న రద్దీని సులభంగా నిర్వహించవచ్చు.ఈ అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రయాణికులకు శుభ్రమైన, ఆధునికమైన మరియు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యం. డిసెంబర్ 2 నాటికి టెండర్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి, విజయవాడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ మరియు తిరుపతి స్టేషన్ల మాదిరిగా ఎయిర్పోర్ట్ స్టైల్ డిజైన్ మరియు ఫెసిలిటీలతో కొత్తగా మెరిసిపోనుంది.ఇది భోపాల్ మరియు గాంధీనగర్ తరువాత PPP మోడల్లో రీడెవలప్ అవుతున్న దేశంలోని మూడో రైల్వే స్టేషన్ అవుతుంది.ఇకపై విజయవాడ ప్రయాణికులకు తక్కువ నడక, ఎక్కువ సౌకర్యం, వేగవంతమైన ప్రయాణం లభించబోతోంది — నిజంగా ప్రజా రవాణా రంగంలో ఇది ఒక పెద్ద ముందడుగు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!