
గాసిప్స్

అంగన్వాడీ చిన్నారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఇకపై చిన్నారులకు రెడీ టూ కుక్ ఫుడ్‌గా ఉప్మా, కిచిడీ మిక్స్‌ను ఉదయపు అల్పాహారంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను కూడా పంపిణీ చేశారు. అలాగే, అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం మరింత బాధ్యతను ఉంచిందని తెలిపారు. చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని, వారికి పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని సీఎం స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!