

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ ప్రకటించింది.. కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఇరాన్ ఇంధన, విద్యుత్ ప్లాంట్లపై దాడులను 5 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్ మీడియా ప్రకారం తహ్రాన్–వాషింగ్టన్ మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని, అమెరికాను నమ్మలేనని స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయం ప్రపంచంలో ఆయిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితిని, గల్ఫ్ మరియు పశ్చిమాసియా దేశాల ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న వ్యూహాత్మక చర్యని పేర్కొంది.
ఇరాన్ సీనియర్ భద్రతా అధికారులు, ఈ 5 రోజుల విరామం రక్షణలో వెనక్కి తగ్గడం కాదని, దేశం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఈ విరామం కేవలం అమెరికా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే అని చెప్పారు. ప్రపంచ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంతో, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు ఇంధన సంక్షోభం మరింత స్పష్టమవుతున్నాయని వివరించారు.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!