

‘నాన్న’ మరియు ‘పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించిన సారా అర్జున్, ‘ధురంధర్’ సినిమాలో స్టార్‌గా ఎదిగింది. 40 ఏళ్ల హీరో రణ్‌వీర్ సింగ్‌కు జంటగా 20 ఏళ్ల సారా అర్జున్ నటించి, తన గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో యూఫోరియా సినిమాతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ధురంధర్-2 థియేటర్లలో ఘన విజయం సాధిస్తోంది.
సారా తండ్రి రాజ్ అర్జున్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్‌లో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో మెప్పించారు. అలాగే, గతేడాది రజాకార్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. సారా తెలుగులో నటించడం గర్వంగా ఉందని అన్నారు. యాంకర్ అడిగిన "మీ ఫేవరేట్ హీరో ఎవరు?" అనే ప్రశ్నకు, సారా తన ఫేవరేట్ హీరోగా విజయ్ దేవరకొండని పేర్కొన్నారు. ఈ ఫేవరేట్ సెలక్షన్‌లో తన తండ్రి పాత్ర ప్రభావం ఉంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!