

తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా రసాయనాలు కలిసాయని జరుగుతున్న ఆరోపణలను ఆపాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని ప్రశ్నించారు. ఇప్పటికే తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరుగుతోందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని సీబీఐకి అందించాలని సూచిస్తూ పిటిషన్ను తిరస్కరించింది.



.jpeg&w=3840&q=75)




-1773128308.jpg&w=3840&q=75)



.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!