
ఓటిటి

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.టి. రామారావుతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీతో తెలంగాణ కోసం పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిందని, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అన్నారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!