

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘బీఆర్ఎస్కు గతం ఉంది కానీ భవిష్యత్ లేదు’’ అని పేర్కొంటూ, కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆ కుటుంబం అంతా కలిసి నటన చేస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, ఆయన విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని సీఎం డిమాండ్ చేశారు. లేకపోతే తాను సీఎం గా, అలాగే కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేసి, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.






.webp&w=3840&q=75)








.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!