

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ రెండు కొత్త జిల్లాలకు సంబంధించి పరిపాలనా వ్యవస్థను వేగంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి కీలక ఆదేశాలు వెలువరించింది. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ (జేసీ) స్థాయిలో ఉన్నత అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలవరం జిల్లాకు ఇన్చార్జి కలెక్టర్‌గా ఎ.ఎస్. దినేశ్ కుమార్‌ను, ఇన్చార్జి ఎస్పీగా అమత్ బర్దర్‌ను, ఇన్చార్జి జేసీగా తిరుమాని శ్రీపూజను నియమించారు. ఈ నియామకాల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
అలాగే మార్కాపురం జిల్లాకు ఇన్చార్జి కలెక్టర్‌గా పి. రాజాబాబు, ఇన్చార్జి ఎస్పీగా వి. హర్షవర్ధన్ రాజు, ఇన్చార్జి జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28 కి పెరిగింది. కొత్త జిల్లాలతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!