

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఆందోళనలో, హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు నిరసన విరమించబోమని ఆమె స్పష్టం చేశారు. అనంతరం పోలీసులు కవితను మరియు పలువురు జాగృతి నాయకులను అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు.

అరెస్ట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, పోలీసులు బలప్రయోగంతో అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. మూసీ నది మధ్యలో పెద్దల భవనాలను వదిలి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ప్రభుత్వాలు పెద్దల పక్షాన ఉన్నాయని వ్యాఖ్యానించారు. నది ఒడ్డుకు 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ కొందరు పెద్దల భవనాలకు 5 మీటర్ల దూరంలోనే అనుమతులు ఇస్తున్నారని అన్నారు. ఈ అక్రమాలపై జాగృతి న్యాయపోరాటం కొనసాగిస్తుందని కవిత స్పష్టం చేశారు.












.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!