
న్యూస్

సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించిన కోర్టు, ఇప్పటికే ఈ అంశంపై స్పష్టమైన సూచనలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.
అయినా సరే టికెట్ల రేట్ల పెంపును అనుమతిస్తూ ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలను పక్కన పెట్టి తెలివిగా మెమోలు జారీ చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి చర్యలను సహించబోమని కోర్టు హెచ్చరించింది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!