
బిజినెస్
.jpeg&w=3840&q=75)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఊరట లభించింది. ఆయనకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మార్చుతూ జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రభాకర్ రావుకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది.
అయితే కేసు దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే తన పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా బెయిల్ కోసం తగిన పూచికత్తును సమర్పించాలని కూడా కోర్టు సూచించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ షరతులతో బెయిల్ మంజూరు చేసింది.









.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!