

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై నమోదైన కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్న కారణంతో పోలీసులు నల్లబాలుపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, వాటిని హైకోర్టు ఇప్పటికే రద్దు చేసింది.
ఈ కేసును విచారించిన హైకోర్టు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా యాంత్రికంగా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం వాదించినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ వాదనను అంగీకరించలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సమంజసమైనవేనని పేర్కొంటూ, మార్గదర్శకాలు జారీ చేయడంలో ఎలాంటి తప్పూ లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా సోషల్ మీడియా విషయంలో పౌరుల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు మరోసారి నొక్కి చెప్పినట్లయ్యింది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!