
గాసిప్స్

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. గతంలో ఇవ్వాల్సిన ఒక పెండింగ్ డీఏను ఇప్పుడు చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెరుగుతుంది.
ఈ డీఏ పెంపు 2023 జూలై నుంచి వర్తించే విధంగా ఇప్పుడు అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 227 కోట్ల అదనపు భారం పడనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!