
గాసిప్స్

మకరవిళక్కు పండుగ సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయం నేడు సాయంత్రం 5 గంటలకు భక్తుల కోసం తిరిగి తెరుచుకోనుంది. ఆలయ తలుపులు తెరిచిన అనంతరం పవిత్రమైన దీపాన్ని వెలిగించి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రకటించింది. మండల పూజలు పూర్తయిన తర్వాత శనివారం రాత్రి ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.
మకరవిళక్కు ఉత్సవాల నేపథ్యంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకునే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శనాలు, క్యూలైన్లు, భద్రత, తాగునీరు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలు సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని దేవస్వం బోర్డు అధికారులు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!