

టీమిండియా హిట్టర్ రింకు సింగ్(Rinku Singh) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఖచంద్ర సింగ్ ఫైనల్ స్టేజ్ కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు. తన తండ్రి ఆరోగ్యం విషయమించడంతో ఇటీవలే రింకు సింగ్ అకస్మాత్తుగా టీమిండియాను విడిచిపెట్టి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఖంచంద్ర సింగ్ స్టేజ్-4 లివర్ క్యాన్సర్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వైద్యులు ఆయనను వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించినట్టు సమాచారం. చివరకు ఇవాళ(ఫిబ్రవరి 27) తెల్లవారుజామున ఖంచంద్ర సింగ్ తుది శ్వాస విడిచారు. టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రింకు సింగ్, తన తండ్రి హెల్త్ ఎమర్జెన్సీతో జట్టును వదిలి ఇంటికి వెళ్లాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ఖంచంద్ర సింగ్ చనిపోయారన్న సమాచారం అందుకున్న వెంటనే రింకు సింగ్.. చెన్నై నుంచి తన స్వస్థలానికి బయలుదేరాడు.
28 ఏళ్ల రింకు సాధారణ కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. జాతీయ జట్టులో చోటు దక్కడంలో తన తండ్రి పాత్ర ఎంతో కీలకమని పలుమార్లు చెప్పుకున్నాడు. కుటుంబానికి అండగా నిలిచిన తండ్రి కోల్పోవడం రింకుకు వ్యక్తిగతంగా పెద్ద లోటు. రింకు తండ్రి మృతిపై సహచర క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రింకుకు సహచర ప్లేయర్లు సానుభూతి తెలుపుతున్నారు. రింకు సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!