.webp&w=3840&q=75)

ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ సినిమారంగం మొత్తం షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాదు సీపీ సజ్జనార్‌తో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు వంటి ప్రముఖులు భేటీ అయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన రాజమౌళి తనదైన స్టైల్లో పైరసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మాట్లాడుతూ—“ఈ అరెస్ట్ మొత్తం ఒక సినిమా క్లైమాక్స్‌లా ఉంది. విలన్ పోలీసుల్ని ఛాలెంజ్ చేసినట్టు, రెండు నెలల తర్వాత పోలీసులు అతడిని కటకటాల వెనక్కి నెట్టేశారు. ఇది పూర్తిగా ‘భస్మాసురుడు తన చేత్తోనే తనను తాను తగలబెట్టుకున్న’ కేసు. పోలీసులు తేలికగా తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు” అని తెలిపారు.
అలాగే ఆయన పైరసీ వల్ల కలుగు ప్రమాదాలను హెచ్చరిస్తూ—“ఏదీ ఉచితంగా రాదు. ఫ్రీగా వస్తోంది అనుకున్న ప్రతిదాంట్లో ప్రమాదం దాగి ఉంటుంది. పైరసీ సైట్లకు మీరు ఇస్తున్న డేటా మీ ప్రాణాలకు కూడా హాని చేసే స్థాయి వరకూ చేరుతుంది. పెద్ద సర్వర్లు పెట్టి పైరసీ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. మా సినిమాలను దొంగిలించడం కాదు… మీ వ్యక్తిగత సమాచారమే వారికి నిధి” అన్నారు.










.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!