
న్యూస్

TG: ఈ ఏడాది జూన్–అక్టోబర్ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. కనిష్టంగా 2 మీటర్లు, గరిష్టంగా 7.93 మీటర్ల లోతుల్లోనే జలాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. గత పది సంవత్సరాలతో పోలిస్తే రాష్ట్ర సగటున 1.7 మీటర్ల మేర భూగర్భ జలాల వృద్ధి నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల స్థాయి 10.7 మీటర్లకు పడిపోగా, అక్టోబర్ నాటికి 4.42 మీటర్ల లోతులోనే పాతాళగంగ పైపైకి ఉబికివస్తోందని పేర్కొన్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!