
.webp&w=3840&q=75)
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 21 వ తేదీ వరకు నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ద్రోణి మరియు నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పోలవరం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణ, కాకినాడ, విశాఖ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!