

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ‘పెద్ది’ కోసం భారీగా కష్టపడుతున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ఒకే పాత్రలో మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సిక్స్‌ప్యాక్ బాడీ కాకుండా, ఒక సహజమైన దేశీ పహిల్వాన్ లుక్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మార్పు కోసం 16 నెలల పాటు కఠిన శిక్షణ కొనసాగించారు.
ఈ శిక్షణలో ఫాస్టింగ్ కార్డియో, వెయిట్ ట్రైనింగ్‌తో పాటు కుస్తీ వ్యాయామాలు, గద ట్రైనింగ్, అఖాడా డ్రిల్స్ వంటి సంప్రదాయ పద్ధతులు అనుసరించారు. రోజుకు 1,800 నుంచి 2,500 క్యాలరీల కార్బ్ సైక్లింగ్ డైట్ పాటించారు. మొదట్లో పల్లెటూరి యువకుడి లుక్ కోసం 4-5 నెలలు బరువు తగ్గారు. ఉదయం 4 గంటలకే ట్రైనింగ్ ప్రారంభించడం, ప్రత్యేక టీమ్‌తో సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్ వినియోగించడం చరణ్ క్రమశిక్షణను చూపిస్తుంది. ఈ సినిమా జూన్‌లో విడుదల కానుండగా, మూడో లుక్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ కానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!