
క్రీడలు

సౌత్ స్టార్ త్రిష కృష్ణన్ పెట్టిన ‘స్లీప్ రికవరీ’ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. నిద్రలేమిపై సరదాగా చేసిన వ్యాఖ్యలో 2062 వరకూ కోలుకోవాల్సి ఉంటుందని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది. వచ్చే నెల 4న ఆమె పుట్టినరోజుతో పాటు తమిళనాడు ఎన్నికల ఫలితాలు రావడం ఈ పోస్ట్‌కు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.
విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం విజయంపై ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఆమె బిజీ సినిమా షెడ్యూల్ కూడా అలసటకు కారణమని భావిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం త్రిష సినిమాలపైనే దృష్టి పెట్టారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!