
క్రీడలు

భారత వాతావరణ శాఖ ప్రకారం ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.
ప్రస్తుతం ఈ ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!