
టెక్నాలజీ

అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. పెట్టుబడులు రాబట్టడంలో సీఎం నిరంతరం కృషి చేస్తారని, పరిశ్రమలు స్థాపించే వరకు ఆగొద్దని సూచిస్తారని మంత్రులు తెలిపారు. ఇందుకు సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్‌లతో పనిచేస్తున్నామని వెల్లడించారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం నాలెడ్జ్ ఎకానమీగా అభివృద్ధి చెందిందని, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల విస్తరణలో కీలక పురోగతి సాధించామని మంత్రులు చెప్పారు. ఆయన క్రమశిక్షణ, ఫలితాలపై దృష్టి పెట్టే విధానం టీమ్‌ను మరింత చురుకుగా పనిచేయడానికి ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ‘రిఫార్మర్’ అనే పదానికి నిజమైన అర్థం చంద్రబాబేనని అభిప్రాయపడ్డారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!