

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజస్థాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్’లో గగన విహారం చేయనున్నారు. అనంతరం భారత్–పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని పోఖ్రాన్లో భారత వైమానిక దళం నిర్వహించే ‘వాయు శక్తి’ విన్యాసాలను వీక్షించనున్నారు. ఈ పర్యటన భారత రక్షణ సామర్థ్యాలు మరియు సైనిక సిద్ధతను ప్రతిబింబిస్తోంది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందించిన ఎల్సీహెచ్ ‘ప్రచండ్’ భారతదేశంలో తయారైన తొలి యుద్ధ హెలికాప్టర్‌గా 2022 అక్టోబరులో వాయుసేనలో చేరింది. ఎడారుల నుంచి పర్వత ప్రాంతాల వరకు వివిధ భౌగోళిక పరిస్థితుల్లో పనిచేయగల ఈ హెలికాప్టర్ 5,000 మీటర్లకు పైగా ఎత్తులో ఎగరగలదు. ఆధునిక ఏవియానిక్స్, స్టెల్త్ సాంకేతికత, రాత్రివేళల్లో దాడి చేసే సామర్థ్యం దీని ప్రత్యేకతలు. రాష్ట్రపతి ముర్ము ఇప్పటికే సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్ యుద్ధ విమానాల్లో గగన విహారం చేసి చరిత్ర సృష్టించగా, గత ఏడాది డిసెంబర్లో ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గామిలో కూడా ప్రయాణించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!