
న్యూస్

గాజులరామారం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 132 కేవీ లైన్‌పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా, మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్టు ఏఈ చైతన్య భార్గవ్ తెలిపారు. గాజులరామారం ఎలక్ట్రిసిటీ సబ్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఈ పనుల వల్ల మంగళవారం రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ నిలిపివేయబడుతుందని ఆయన సోమవారం వెల్లడించారు.
ప్రభావిత ప్రాంతాలుగా చంద్రగిరి నగర్ చౌరస్తా, అంబేద్కర్ నగర్, ఉమాదేవి నగర్, ఎన్టీఆర్ నగర్, జనని స్కూల్ లైన్, చంద్రగిరి నగర్ దర్గా లైన్, బాలాజీ స్కూల్ లైన్, పీపీ నగర్, మజీదు లైన్, జహంగీర్ బస్తీ, ఇందిరానగర్–బీ, ఎంఎఫ్ ఫంక్షన్ హాల్ ప్రాంతం, తిరుపతిరెడ్డి బస్తీ, ఎస్సీబీ నగర్ లను పేర్కొన్నారు.
మరమ్మతుల సమయంలో వినియోగదారులు కలిగే అసౌకర్యాన్ని అర్థం చేసుకుని సహకరించాలని చైతన్య భార్గవ్ కోరారు.


.webp&w=3840&q=75)












.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!