

ఐబొమ్మ రవి కి సంబంధించిన కస్టడీ రిపోర్టును పోలీసులు బుధవారం కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి రెండు రకాల సినిమా ప్రింట్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నార్మల్ ప్రింట్కు 100 డాలర్లు, హెచ్డీ ప్రింట్కు 200 డాలర్లు చెల్లించినట్లు తెలిపారు. రవి కి సంబంధించిన మొత్తం ఏడు ఖాతాలను గుర్తించగా, వాటిలో రూ.13.40 కోట్ల నగదు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
బెట్టింగ్ ప్రకటనల ద్వారా రూ.1.78 కోట్లు సంపాదించినట్లు విచారణలో తేలింది. అలాగే తన సోదరి చంద్రిక కు రూ.90 లక్షల నగదు పంపినట్లు రవి తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే జరిగినట్లు గుర్తించారు. రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్మార్క్ లైసెన్స్, బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో రవి విలాసవంతమైన జీవితం గడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో రవి తన ఆఫీస్ నడిపినట్లు కస్టడీ రిపోర్టులో స్పష్టం చేశారు. సుమారు 12 రోజుల కస్టడీ అనంతరం మంగళవారం అతడిని జైలుకు తరలించారు. ఈ కస్టడీలో వెల్లడైన కీలక అంశాలను కోర్టుకు సమర్పించారు. మొత్తం ఆదాయంలో దాదాపు రూ.10 కోట్లు హైఫై పబ్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఖర్చు చేసి లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రవి అకౌంట్లో ఉన్న రూ.3 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!