
బిజినెస్

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి. అస్సాం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఉంది.
దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.19 వేల కోట్లు నేరుగా జమ కానున్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఈ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరనున్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఈ పథకం కీలకంగా మారింది.














.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!