
న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాల భాగంగా ఈ గౌరవాన్ని ప్రకటించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి సాధించిన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఉండటమే కాకుండా తెలుగు చిత్రసీమకు గొప్ప గుర్తింపును తీసుకువచ్చిందని ఆయన తెలిపారు.

తెలుగు చిత్రరంగంలో చిరంజీవి ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఈ గౌరవాన్ని అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన చిరంజీవికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ గద్దర్ పురస్కారాలకు ఎంపికైన ఇతరులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!