
న్యూస్

అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కాబుల్‌లోని ఒక ఆస్పత్రిపై జరిగిన దాడిలో సుమారు 200 మంది మరణించినట్లు అఫ్గాన్ ప్రభుత్వం తెలిపింది. ఆ ఆస్పత్రిలో డ్రగ్స్‌కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. అఫ్గాన్ పౌరులపై ఎలాంటి వైమానిక దాడులు జరపలేదని, ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!