
క్రీడలు

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జాతీయ ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది. పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు సాగు నీరు, తాగునీరు మరియు విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించనుంది.
ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్రం అదనంగా రూ.3,300 కోట్లు విడుదలకు అంగీకరించింది. ఇటీవలే రూ.2,300 కోట్లు విడుదల చేసిన కేంద్రం, మరిన్ని నిధులు కేటాయించడం ద్వారా పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి అయ్యే అవకాశం ఉంది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!