

ముంబైలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం తర్వాత కొన్ని వర్గాలు విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేయడంపై వీఎస్ఆర్ ఏవియేషన్ యజమాని విజయ్ కుమార్ సింగ్ స్పందించారు. తమ సంస్థకు చెందిన ఫ్లైట్స్ అన్ని 100 శాతం ఫిట్‌గా ఉన్నాయని, ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేశారు. విమానాలను నిలిపివేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించిన ఆయన, ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతిపాదన కూడా లేదన్నారు. ప్రమాదానికి విమానంలోని లోపం కారణం కాదని, అది పూర్తిగా ఫిట్‌గానే ఉందని వెల్లడించారు.
ప్రమాదం జరిగిన లియర్ జెట్ 45 ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాల్లో ఒకటని విజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ల్యాండింగ్ సమయంలో తక్కువ విజిబులిటీ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పైలట్ అంచనాలో చిన్న పొరపాటు జరిగి ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనపై అనవసర ఊహాగానాలు చేయకుండా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!