
సినిమాలు

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ పార్టీపై మరో ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం నిర్వహించిన సర్వే ప్రకారం విజయ్ పార్టీకి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో 121 సీట్లు గెలుచుకుని ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరవచ్చని నివేదిక పేర్కొంది.
ఈ సర్వే ప్రకారం డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఓటు బ్యాంకుకు భారీ ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ సర్వే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!