

ఆన్లైన్ గేమింగ్‌కు బానిసైన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసపోయానంటూ రవీందర్ (24) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కొద్ది రోజులుగా ఆన్లైన్ గేమ్స్‌లో పాల్గొంటూ ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రవీందర్, నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో స్నేహితులు, పరిచయస్తుల నుంచి అప్పులు తీసుకుని మరింత పెట్టుబడి పెట్టాడు. అయితే ఆశించిన లాభాలు రాకపోగా, అప్పుల భారం మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోయిన అతడు ఆత్మహత్యకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు ముందు రవీందర్ ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో ఆన్లైన్ గేమ్స్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయిన విషయాన్ని చెప్పి, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని స్నేహితులకు సూచించాడు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని కూడా పేర్కొన్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి, ఆర్థిక నష్టాలు, అప్పుల వివరాలు, ఆత్మహత్యకు దారితీసిన కారణాల పై దర్యాప్తు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!