
న్యూస్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన స్వయంగా ఖండిస్తూ X వేదికగా వీడియోలను విడుదల చేశారు. ఈ వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
మొదట విడుదల చేసిన వీడియోలో నెతన్యాహు కాఫీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడారు. అనంతరం విడుదల చేసిన మరో వీడియోలో ఆయన పర్యాటక ప్రాంతంలో ప్రజలతో కలసి మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఇంట్లోనే ఉండిపోకుండా కొంతసేపు బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలని కూడా నెతన్యాహు పేర్కొన్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!