
గాసిప్స్

ఫిబ్రవరిలో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీ తో పాటు, రాష్ట్రంలోని మిగతా పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభమయ్యేలోగానే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అయితే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని రెండు మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో, ఈ ఎన్నికల ప్రక్రియ నుంచి వాటిని మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా సిద్ధంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ముందస్తు చర్యలు చేపట్టింది. జనవరి రెండో వారం నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేసేలా అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!