
సినిమాలు

ఈ నెల 9న ప్రముఖ భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, ముఖ్యంగా క్రికెట్ మౌలిక సదుపాయాల విస్తరణపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశంపై ధోని–చంద్రబాబు మధ్య కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. యువ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందించడం, అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాల అభివృద్ధి దిశగా ఈ భేటీ కీలకంగా మారనుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!