
న్యూస్

ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా చేసినట్లు సమాచారం. ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపర్చేందుకు ఈ సహాయం అందించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవాళ రాత్రికి యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. బాంబుల మోత భారీగా వినిపించే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో మూడు వేలకుపైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ దాడుల వల్ల ప్రభావిత ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!