
జనరల్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) ద్వారా రుణాల మంజూరు అంశంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
సోమవారం రాత్రి ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో సీఎం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, రెండు గంటలకు పైగా సాగిన చర్చల్లో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు, నిధుల సమీకరణ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ అంశాలపై మరింతగా చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!