

బాపట్ల జిల్లా చింతగుంపల గ్రామానికి చెందిన 94 ఏళ్ల ప్రవాసాంధ్రురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ భారత పౌరసత్వం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కోరారు. భారతీయురాలిగానే స్వగ్రామంలో చివరి శ్వాస తీసుకోవాలని, తన అంత్యక్రియలు కూడా స్వగ్రామంలోనే జరగాలన్నదే తన చివరి కోరిక అని ఆమె విజ్ఞప్తి చేశారు. భర్త మరణం తర్వాత అమెరికాలోని వర్జీనియాలో తన కుమారుడు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ బుచ్చయ్య చౌదరి వద్ద నివసించిన మహాలక్ష్మమ్మ 2000లో అమెరికా పౌరసత్వం పొందారు. అనంతరం 2018లో స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నారు.
అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న మహాలక్ష్మమ్మ తిరిగి భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ సమక్షంలో జరిగిన విచారణలో భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. విచారణ పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, అనంతరం కేంద్ర ప్రభుత్వ పరిశీలన తర్వాత పౌరసత్వ ప్రక్రియ పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!